Posts

Showing posts from March, 2024

వైరాగ్యానికి అటు ఇటు..

శ్రీశాంతి.. 23-3-2024 కంఫర్ట్ దీనిని ప్రతి ఒక్కరూ ఆశిస్తూనే ఉంటారు. జీవితంలో ఎన్ని చేసినా కూడా అవన్నీ కంఫర్ట్ కోసమే.. ఎన్ని కష్టాలు పడినా కూడా సౌకర్యం కోసమే.. లేకపోతే ఎందుకీ పాడు బతుకు అనిపిస్తుంది. నిజానికి ఎక్కడెక్కడ తిరిగినా రోజులో ఎక్కడ తిరిగి వచ్చినా, కూడా ఇంటికి చేరే సరికి కలిగే ఆనందం వేరు. నా వరకూ నాకు మెట్లెక్కి నా ఇంటి గుమ్మం ముందుకు చేరుకోగానే.. ఓ పాజిటివ్ నెస్ కనిపిస్తుంది. కొత్త ప్రదేశంలో ఎన్ని సౌకర్యాలు ఉన్నా కూడా మన ఇంటి మంచం మీద పడుకున్నప్పుడు పట్టే నిద్రే నిద్ర.  హాల్లో చిన్న బొంత మీద కూర్చున్నా అదే ఆనందం. చుట్టూ మనం నాటుకున్న మొక్కల మధ్యలో కాసేపు నిలబడినా,  నచ్చిన పాట వింటూ సమయం గడిపినా ఎక్కడ దొరుకుతుంది ఇలాంటి ఆనందం.  ఇక తిండి విషయానికి వస్తే.. నాలుకకు కొత్త రుచులు కావాలి. రోజులో ఎంత చెత్త తినాలన్నా కూడా అది ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. తిండి విషయంలో ఒకప్పుడు ఉన్న చాపల్యం ఇప్పుడు తగ్గిందనిపిస్తుంది. ఏదో తినేయాలన్న ఆత్రం తప్పితే చక్కగా అన్ని కూరగాయలూ వేసుకుని పెట్టుకున్న దప్పళం ముందు ఈ పిచ్చి తిళ్ళు ఏం బావున్నాయనిపిస్తుంది. పులిహోరను కొట్టే వంటకం మరొకటి ఉందా...

గిల్ట్ ఫీలింగ్ మోసుకెళుతున్న క్షణాలు..

Image
21-3-2024 శ్రీశాంతి మెహెర్.. జీవితం అంటే కాలంలో కదిలిపోవడమే అని ఓ పెద్దాయన చెప్పాడు. అదే చలం అన్నమాటే.. కాలం కదిలిపోవడం కాదు.. మనకున్న హడావుడికి కాలం పరుగులు పెడుతుంది. చాలా గడబిడలో చాలా చేయాలనుకుని చేయలేని సందర్భాలు చాలానే ఉంటాయి. నాకు నేను పరుగెత్తి పరుగెత్తీ అలసిపోయి.. ఆగిచూస్తే అక్కడ కూడా సమయమే వెక్కిరిస్తూ కనిపిస్తుంది. సమయాన్ని పట్టుకుందామని చూస్తున్న ప్రతిసారీ రెట్టించిన ఉత్సహంతో పరుగుపెడుతూనే ఉంటుంది.  సరే సమయం వెనుక పరుగులో నేను చేసే పెద్ద గిల్డ్ పనేంటంటే.. బాబుని గేటుదగ్గర వాచ్ మేన్ చూడకుండా స్కూల్ ముందు దింపేసి, అదిగో అక్కడే మొదలవుతుంది నా గిల్ట్.. వాడికి కనిపించకుండా ఎందుకు దిగబెట్టడం అంటే పిల్లాడి స్కూల్ షూస్ పాలీష్ లేవని, సాక్స్‌లు సరిగా ఉతకలేదని ఇలా ఏదో సాకుతో ఆపి మరీ పంచాయితీ పెడుతుంటాడు. అందుకోసం వాడికి కనిపించకుండా స్కూల్ గేటుకు కాస్త ముందో, లేదా స్కూల్ బస్ చాటునో పిల్లాడిని వదిలేసి వెళిపోతుంటాను.  ఇక గిల్ట్ రెండు.. స్కూల్ తతంగం కాగానే రోడ్డు పట్టుకుని బయలుదేరతానా.. ఎంత దగ్గరగా రూట్ దొరుకుతుందా.. ఎంత త్వరగా ఆఫీస్ కి వెళిపోదామా అనే ఆలోచన ఒక్కటే మెద...

ఈ సీతాకోక డిజైన్ ఉంది చూసారూ.. నాకు రోత పుట్టించింది..

 శ్రీశాంతి.. 20-3-2024 వాగులు వంకలు పొంగి పొరలి ఊళ్ళ మీదకు వచ్చి ముంచి పోయిన ప్రతి సారీ మళ్ళీ కొత్తగా పుట్టుకొస్తాయి ఊళ్ళు... నిజానికి కొత్తగా పుట్టడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే విషయమే. పరిస్థితులకు తగినట్టుగా, పరిసరాలకు అనువైన విధంగా మనల్ని మనం మార్చుకోవడం ఎప్పుడూ జరిగే విషయమే. కాలానికి తగినట్టుగా ఉండటం అనేది అంత సులువైన విషయం కూడా కాదు. చాలా విషయాల్లో మనల్ని గేలి చేసే వ్యక్తుల నుంచి, ఎద్దేవల నుంచి కొత్తగా పుట్టుకు రావడం అంటే కాస్త పెద్ద పనే..  కొత్తదనాన్ని ఏ విషయంలో గమనించినా కూడా సంబరంగా ఉంటుంది నాకు. కాస్త చిత్రంగా కూడా.. ఒకప్పుడు సీతాకోక చిలుకల్ని చూసినప్పుడు భలే ముచ్చట వేసేది. ఎంత ముచ్చట అంటే దాన్ని పట్టుకుని చేతుల్లోకి తీసుకుని మురిసిపోయేంత ఇష్టంగా అనిపించేది. అయితే ఆ ఇష్టం అలా ఉండగానే ప్రకృతిలో మార్పు, పరిసరాల్లో మార్పుల కారణంగా ఎప్పుడన్నా ఏ సినిమా సీన్ మధ్యో తప్పితే సీతాకోక చిలుకలు కనిపించేది తక్కువైపోతున్న తరుణంలో సడెన్ గా.. అంటే చాలా సడెన్ గా మళ్లీ సీతాకోక చిలుకలు కనిపించడం మొదలయ్యాయి. అవి చీరల మీదకు వచ్చే సరికి అబ్బా.. ఈ డిజైన్ భలే ఉందే అని కొనేసి, పక్కన పెట...