వైరాగ్యానికి అటు ఇటు..
శ్రీశాంతి.. 23-3-2024 కంఫర్ట్ దీనిని ప్రతి ఒక్కరూ ఆశిస్తూనే ఉంటారు. జీవితంలో ఎన్ని చేసినా కూడా అవన్నీ కంఫర్ట్ కోసమే.. ఎన్ని కష్టాలు పడినా కూడా సౌకర్యం కోసమే.. లేకపోతే ఎందుకీ పాడు బతుకు అనిపిస్తుంది. నిజానికి ఎక్కడెక్కడ తిరిగినా రోజులో ఎక్కడ తిరిగి వచ్చినా, కూడా ఇంటికి చేరే సరికి కలిగే ఆనందం వేరు. నా వరకూ నాకు మెట్లెక్కి నా ఇంటి గుమ్మం ముందుకు చేరుకోగానే.. ఓ పాజిటివ్ నెస్ కనిపిస్తుంది. కొత్త ప్రదేశంలో ఎన్ని సౌకర్యాలు ఉన్నా కూడా మన ఇంటి మంచం మీద పడుకున్నప్పుడు పట్టే నిద్రే నిద్ర. హాల్లో చిన్న బొంత మీద కూర్చున్నా అదే ఆనందం. చుట్టూ మనం నాటుకున్న మొక్కల మధ్యలో కాసేపు నిలబడినా, నచ్చిన పాట వింటూ సమయం గడిపినా ఎక్కడ దొరుకుతుంది ఇలాంటి ఆనందం. ఇక తిండి విషయానికి వస్తే.. నాలుకకు కొత్త రుచులు కావాలి. రోజులో ఎంత చెత్త తినాలన్నా కూడా అది ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. తిండి విషయంలో ఒకప్పుడు ఉన్న చాపల్యం ఇప్పుడు తగ్గిందనిపిస్తుంది. ఏదో తినేయాలన్న ఆత్రం తప్పితే చక్కగా అన్ని కూరగాయలూ వేసుకుని పెట్టుకున్న దప్పళం ముందు ఈ పిచ్చి తిళ్ళు ఏం బావున్నాయనిపిస్తుంది. పులిహోరను కొట్టే వంటకం మరొకటి ఉందా...