walk alone
మనసు గందరగోళంగా ఉన్నప్పుడు అలా కాలినడకన నడవటం మామూలు సంగతి. కానీ ఒళ్ళు తగ్గించుకోడానికి నడవటం అన్నది ఏమన్నా బాగుందా! ఇంటి పోరు పడలేక ఉదయాన్నే నడవడం మొదలెట్టాకా, ఎందుకు నడుస్తున్నాను. కాసేపు పడుకుంటే పోయేదికదా అని కాస్త నీరసంగా అనిపించి తిరిగివచ్చేయబుద్దవుతుంది. ఇలా డోలాయమానంలో పడిపోయి, కొట్టుకోవడం మొదటినుండీ మామూలేనాకు. నడక నాలో ప్రశాంతతని నింపడం కంటే నీరసాన్ని, నిస్తేజాన్ని నింపిపారేస్తుంది. ఒక్కసారిగా ఒంటరినైపాయానన్న బాధ ఓవైపు, లావుగా ఉన్నానని నాకు నేనే ప్రచారం చేసుకోవడం అవసరమా అనికాసేపూ, మరికాసేపటికి అక్కడ ఇంట్లోవాళ్ళంతా ముసుగుతన్ని పడుకుంటే నాకేనా ఈ పాట్లు, అంతపాపం నేనేం చేసాననే తిరుగుబాటు కాసేపు, ఇలా పరిపరి విధాలా నాలో నేను చిన్నపాటి యుద్ధం చేసి నీరసంగా కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి వచ్చిపడతాను. సరే రొప్పుకుంటూ ఇంట్లో అడుగు పెడితే, "అప్పుడే అయిపోయిందా! ఈ పాటిదానికి ఎందుకు వెళ్ళడం చాల్లే" అంటూ చీదరింపులు. నేనేం చేసేది. ఒళ్ళు వస్తానంటే వద్దనగలమా, నాకీ వళ్ళు వద్దంటే అదిపోతుందా అంతా మిధ్య. ఏదీ ఈ భూమిమీద శాశ్వతం కాదు. ఎప్పుడో ఒకప్పుడు పోతుంది. లేదా ఇలా లావుగా చూసీ చూ...